
నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేసిన నిరసన వివాదాస్పదమైంది.
విద్యార్థుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై తాత్కాలిక నిషేధం విధించింది.
అయితే, మెజారిటీ విద్యార్థులు నిరపరాధులని గుర్తించిన బీసీఐ, ఆ నిషేధాన్ని వెనక్కి తీసుకుని విద్యార్థులకు ఉపశమనం కల్పించింది.