
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు చేరుతోంది.
జలాశయం నిండుకుండలా మారడంతో అలల తాకిడికి పడవలు తిరగబడే ప్రమాదం ఉందని తహసీల్దార్ ఉమారాణి మత్స్యకారులను హెచ్చరించారు.
వరద ఉధృతి కారణంగా నదీగర్భంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం పూర్తిగా నీట మునిగిపోగా, పర్యాటకులు ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.