డిజిటల్ చెల్లింపుల రంగాన్ని మరింత వేగవంతం చేసేందుకు గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో రెండు కొత్త యూపీఐ ఫీచర్లను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆవిష్కరించారు.
క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే ఫోన్ ట్యాప్ చేసి పేమెంట్ చేసే 'యూపీఐ ట్యాప్ అండ్ పే' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
దీంతో పాటు చెల్లింపుల సమస్యల పరిష్కారం కోసం ఏఐ ఆధారిత 'మై యూపీఐ' ప్లాట్‌ఫామ్‌ను కూడా లాంచ్ చేశారు.