
భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ స్పందిస్తూ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కన్నా చౌకగా ఇంటర్నెట్ అందిస్తామని ప్రకటించారు.
స్టార్‌లింక్ రాకతో ప్రజలకు ఆప్షన్లు పెరుగుతాయని, అంబానీ లాభాలు తగ్గవచ్చు కానీ వ్యాపారం నుంచి వైదొలగరని ఆయన ఎక్స్‌లో తెలిపారు.
భారత్‌లో శాటిలైట్ ఆధారిత సేవలకు స్టార్‌లింక్‌తో పాటు జియో శాట్‌లైట్, వన్‌వెబ్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏ సంస్థకూ పూర్తిస్థాయి అనుమతులు రాలేదు.