మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఆంధ్రప్రదేశ్‌లోని దుగరాజపట్నంలో రూ. 26,000 కోట్ల అంచనా వ్యయంతో షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీ మారిటైం బోర్డు 2,200 ఎకరాల భూమిని సేకరిస్తుండగా, అందులో 1,000 ఎకరాలు షిప్‌యార్డుకు, 1,350 ఎకరాలు అనుబంధ పరిశ్రమలకు కేటాయించనున్నారు.
ఈ నెల 24న టెక్నికల్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టనుండగా, కేంద్రం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులను భరించనుంది.