
అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద జరిగిన కత్తిదాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మరణించారు.
మంగళవారం క్వీన్స్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ తన బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో మరణించిన ఎరిన్ పియాసెంటి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పోలీసులు ధృవీకరించారు.