
కెనడాలోని ఒంటారియోలో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేసి, రూ. 930 కోట్ల విలువైన 1.7 టన్నుల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో 19 మందిని అరెస్టు చేయగా, వారిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్లు ఉన్నారని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.
2025 జనవరి నుంచి 'ప్రాజెక్టు బే' పేరుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు, స్వాధీనం చేసుకున్న వాటిలో 973 కిలోల కొకైన్, 660 కిలోల మెథాంఫెటమైన్ వంటివి ఉన్నాయని వెల్లడించారు.