
రాష్ట్రంలో నీటి లభ్యత ఆధారంగా నిర్వహణ చేపట్టాలని, తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టులో 89.9 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది మార్చికల్లా విశాఖ వరకు ఎడమ కాలువ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గోదావరికి 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రాజెక్టు పనులకు ఇబ్బంది కలగలేదని, పోలవరం కాలువల్లో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా పనులు చేయాలని సూచించారు.