
మొహాలీ వేదికగా జరిగిన తొలి అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా ‘ఎ’ మహిళల జట్టుపై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.3 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ కాగా, భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 41.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది; తేజల్ హసాబ్నిస్ (81), అనుష్క శర్మ (55) అర్ధ శతకాలతో రాణించారు.