
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 4,16,358 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 30 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది మరియు 3,90,300 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు.
కడెం ప్రాజెక్టు నుంచి 1,56,279 క్యూసెక్కులు, ఎగువ ప్రాంత వర్షాల ద్వారా 2,60,079 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.