
ఆశ్వయుజ శుక్ల దశమి తిథి రెండు రోజులు రావడంతో ఈ ఏడాది విజయదశమి తేదీలపై ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది.
ఉత్తర భారతదేశంలో అక్టోబర్ 20న దసరా వేడుకలు జరుపుతుండగా, పశ్చిమ బెంగాల్లో అక్టోబర్ 21న నిర్వహిస్తున్నారు.
పంచాంగం ప్రకారం పూజలకు అక్టోబర్ 20 మధ్యాహ్నం విజయ ముహూర్తం అత్యంత శ్రేష్ఠమైనదని పండితులు పేర్కొన్నారు.