
15 ఏళ్ల 175 రోజుల వయసున్న వైభవ్ సూర్యవంశీ, దులీప్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్, 1969లో లక్ష్మణ్ సింగ్ నెలకొల్పిన 57 ఏళ్ల రికార్డును అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ 81 బంతుల్లో 92 పరుగులు చేసి ఔట్ కాగా, ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది.