
మొరాకో సరిహద్దు నుంచి వేలాది మంది వలసదారులు స్పెయిన్కు చెందిన సియుటా ప్రాంతంలోకి ఒక్కసారిగా ప్రవేశించడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఏడాది జూలై 15 వరకు సుమారు 3 వేల మంది వలసదారులు సియుటాకు చేరుకోగా, గత వారం రోజుల్లోనే 1,500 మందికి పైగా ప్రవేశించారు.
సరిహద్దు భద్రత కోసం సైన్యాన్ని మోహరించాలని స్థానిక అధికారులు డిమాండ్ చేస్తుండగా, స్పెయిన్ ప్రభుత్వం మొరాకోతో కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.