
టిబెట్ ప్రాంతంలో మొదలైన వరదల వల్ల నేపాల్‌కు భారీ నష్టం వాటిల్లగా, దీనికి సంబంధించిన వీడియోలను చైనా ప్రభుత్వం సెన్సార్ చేస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
వరదల్లో చిక్కుకున్న 320 మంది భారతీయుల ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది.
నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734కు చేరగా, 2,500 మంది గల్లంతయ్యారని తాజా నివేదికలు చెబుతున్నాయి.