
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనాలోచిత నిర్ణయాల వల్లే జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ విమర్శించారు.
ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచిందని, మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవకపోతే అది అవమానకరమని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 9-13 మధ్య బర్మింగ్ హామ్ వేదికగా జరగనున్న మూడో టెస్టు కోసం పాకిస్థాన్ జట్టులో ఏడుగురు ఆటగాళ్లను బోర్డు మార్చింది.