
విజయవాడ నగరంలోని 24,057 పేద కుటుంబాలకు సెప్టెంబరు 30న కూటమి ప్రభుత్వం 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమం ద్వారా ఇళ్ల పట్టాలు అందించనుంది.
ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.9,800 కోట్ల విలువైన 617 ఎకరాల భూమిపై పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం సహా 8 నియోజకవర్గాల్లోని 15 మండలాల ప్రజలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.