
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన బాలీవుడ్ చిత్రం ‘హనుమాన్ అంశ్’ మౌత్ పబ్లిసిటీతో సంచలనం సృష్టిస్తూ ఇప్పటికే రూ. 100 కోట్ల వసూళ్లను సాధించింది.
నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా నికర వసూళ్లు రూ. 89 కోట్లకు చేరుకున్నాయని చిత్రబృందం వెల్లడించింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సినిమాను ట్యాక్స్-ఫ్రీగా ప్రకటించారు.