
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపి యుద్ధం ముగింపుపై త్వరలో ఓ ఒప్పందానికి వస్తారని ఆశిస్తున్నట్లు అమెరికా నేత ట్రంప్ తెలిపారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షులు నేరుగా మాట్లాడుకోవాలని ఆయన సూచించారు.
ఈ చర్చల ద్వారా త్వరలోనే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.