
తెలంగాణలో మొత్తం 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరించే పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన రూ.27 కోట్ల వ్యయంతో జరుగుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు.
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.