
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సోమవారం నుంచి సౌత్‌జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య జరగనున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ ఎంపికయ్యారు.
సెమీస్‌లో పేసర్ విద్వత్ కావేరప్ప గాయపడటంతో, సిరాజ్‌తో పాటు మరో హైదరాబాదీ పేసర్ సీవీ మిలింద్‌ను జట్టులోకి తీసుకున్నారు.
భారత టెస్టు ఆటగాళ్లకు ఈ మ్యాచ్ ద్వారా మెరుగైన ప్రాక్టీస్ లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది.