
డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆహ్వానించారు.
ఈ సదస్సులో భాగంగా నిర్వహించే డిఫెన్స్ ఎక్స్పో 2026ను ప్రారంభించాలని, ఎయిర్ షో కోసం వైమానిక దళ సహకారం అందించాలని సీఎం కోరారు.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కోసం 1500 ఎకరాల భూసేకరణ మరియు మహబూబ్ నగర్ ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుకు కేటాయించే అంశాలను సీఎం వివరించారు.