
చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ గా జహీర్ ఖాన్ నియామకానికి ముందు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కోసం ఆ జట్టు తీవ్రంగా ప్రయత్నించిందని రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు.
ఆశిష్ నెహ్రా గుజరాత్ టైటాన్స్ ను వీడేందుకు సిద్దంగా లేకపోవడంతో జహీర్ ఖాన్ ను హెడ్ కోచ్ గా నియమించిందని ఆయన చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టడంతో ఈ మార్పు అనివార్యమైందని అశ్విన్ పేర్కొన్నాడు.