
డయాబెటిస్తో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున సొంపు నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సొంపు గింజల్లో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఒక టీస్పూన్ సొంపును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా తాగడం వల్ల మధుమేహగ్రస్తులకు ఎంతో మేలు జరుగుతుంది.