కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టులో కుల్‌దీప్ యాదవ్ స్థానంలో 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శ్రీలంక జట్టులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను దృష్టిలో ఉంచుకుని, కోచ్ గౌతమ్ గంభీర్ సారాంశ్ జైన్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపి ప్రాక్టీస్ చేయించారు.
టెస్టుల్లో 20 వికెట్లు తీయగల అత్యుత్తమ బౌలింగ్ విభాగాన్నే బరిలోకి దించుతామని గంభీర్ స్పష్టం చేయగా, తుది జట్టుపై నిర్ణయం టాస్ సమయంలో వెలువడనుంది.