
గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్లో అరెస్ట్ చేశారు.
పొగాకు వ్యాపారిని కిడ్నాప్ చేసి నిర్బంధించిన కేసులో ముస్తఫాపై కిడ్నాప్, బెదిరింపుల కేసులు నమోదయ్యాయి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముస్తఫా ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.