తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి సీఎం హోదాలో 15వ సారి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో నిర్వహించిన శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.