
ఐక్యరాజ్య సమితి 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా ఇరాన్, అమెరికా ప్రతినిధులు మూడు గంటలపాటు సమావేశమయ్యారు.
హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొన్ని షరతులను అమెరికా ముందుంచినట్లు వెల్లడైంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మధ్య ఈ భేటీ జరిగింది.