ఇంటర్నెట్ వాడని వారికి, ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేక వాయిస్, SMS ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు TRAI ఆదేశాలు జారీ చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, అన్ని కాల వ్యవధులకు వాయిస్, SMS మాత్రమే ఉండే ప్లాన్లను అందుబాటులో ఉంచాలి.
ట్రాయ్ ఆదేశాలతో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు స్వల్పంగా పడిపోయాయి.