
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో తెలంగాణలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
కరవు మండలాల ప్రకటనతో పాటు చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మరియు క్యాబినెట్ సబ్‌కమిటీలో చర్చించాలని అధికారులను సీఎం ఆదేశించారు.