
వరుసగా నాలుగు నెలల పాటు పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), జూలై నెలలో రూ. 20,200 కోట్ల నికర పెట్టుబడులను భారత మార్కెట్లోకి తెచ్చారు.
కార్పొరేట్ కంపెనీల బలమైన ఆర్థిక ఫలితాలు, ఆకర్షణీయమైన వాల్యూయేషన్లు మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం ఈ పెట్టుబడులకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
గత మార్చిలో రూ. 1.17 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో రూ. 60,847 కోట్లు, మేలో రూ. 32,963 కోట్లు, జూన్‌లో రూ. 49,340 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లినట్లు సీడీఎస్‌ఎల్ గణాంకాలు చెబుతున్నాయి.