
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఎంఎస్ పల్లిలో శుక్రవారం ఉ.8.30 నుంచి సా.5 గంటల వరకు అత్యధికంగా 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో శనివారం పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.