
మియాపూర్ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నారని సీఎం ఆరోపించారు.
మియాపూర్ భూములను స్వాధీనం చేసుకున్న అనంతరం కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.