
జలుబు చేసినప్పుడు వెంటనే మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకోవడం సరైన పద్ధతి కాదని, వైరల్ ఇన్ఫెక్షన్లపై యాంటీబయాటిక్స్ పనిచేయవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సాధారణ జలుబు 4 నుంచి 7 రోజుల్లోనే తగ్గిపోతుందని, శరీర రోగనిరోధక శక్తి వైరస్‌తో స్వయంగా పోరాడుతుందని వారు తెలిపారు.
పసుపు కఫం, అధిక జ్వరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ సలహా తీసుకోవాలని, విశ్రాంతి తీసుకుంటూ ఆవిరి పట్టడం మంచిదని సూచించారు.