
పొగాకు, సిగరెట్లు సేవించని వారికి కూడా హెచ్‌పీవీ (HPV) ఇన్‌ఫెక్షన్, జన్యుపరమైన కారణాల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
సిగరెట్ తాగేవారి పక్కన కూర్చోవడం వల్ల వెళ్లే పొగ (సెకండ్ హ్యాండ్ స్మోకింగ్) కూడా క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యల వల్ల నోటిలో నిరంతర మంట, వాపు ఉండటం కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.