హైదరాబాద్‌లోని జన్వాడ ఫామ్‌హౌస్ తన వ్యక్తిగత ఆస్తి అని, 2019లో కొనుగోలు చేసి కేటీఆర్‌కు లీజుకు ఇచ్చానని యజమాని ప్రదీప్‌రెడ్డి స్పష్టం చేశారు.
భూమిపై కేటీఆర్‌కు ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని, ఆస్తికి సంబంధించి చట్టబద్ధమైన టైటిల్ ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఏవైనా సందేహాలుంటే నోటీసులు పంపవచ్చని, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.