తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పార్టీ క్రమశిక్షణ, కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, అంతర్గత వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2014 తర్వాత తెలంగాణలో ఏర్పడిన మూడు ప్రభుత్వాల్లోనూ ఒక్కో కీలక మంత్రి బర్తరఫ్ కావడం గమనార్హం; గతంలో తాటికొండ రాజయ్య, ఈటల రాజేందర్ ఇలాగే పదవులు కోల్పోయారు.