
బంగారం ధరల అస్థిరత కారణంగా ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో భారతదేశంలో పసిడి డిమాండ్ 6 శాతం తగ్గి 131 టన్నులకు పరిమితమైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.
ధరలు పెరగడంతో ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75 టన్నులకు పడిపోయినప్పటికీ, విలువ పరంగా 34 శాతం పెరిగి రూ.1.13 లక్షల కోట్లకు చేరింది.
పెట్టుబడి సాధనంగా బంగారం బిస్కట్ల డిమాండ్ 9 శాతం పెరిగి 50 టన్నులకు, గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు 62 శాతం పెరిగి 4 టన్నులకు చేరుకున్నాయి.