
హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోలు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీస్ వాహనం ఎక్కేందుకు నిరాకరించిన హరీశ్ రావు, కలెక్టరేట్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ వరకు కాలినడకన వెళ్లారు.
ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన ప్రకటించారు.