
భారతదేశం తన శిలాజ ఇంధనేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో నిర్దేశించుకున్న 500 గిగావాట్ల లక్ష్యంలో ఇప్పటికే 300 గిగావాట్లను సాధించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ 300 గిగావాట్ల సామర్థ్యం మొత్తం లక్ష్యంలో 60 శాతానికి సమానమని కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పర్యావరణ హితమైన ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఈ మైలురాయిని చేరుకోగలిగారు.