
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఆదివారం ఒక్కరోజే రూ.13 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, ఫస్ట్ వీకెండ్‌లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనం సృష్టించింది.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, తమన్ సంగీతం అందించారు.