దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగి రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తాయి.
ఒత్తిడి కారణంగా అడ్రినలిన్ ఉత్పత్తి పెరిగి గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని క్లీవ్‌లాండ్ క్లినిక్ తెలిపింది.
మితిమీరిన ఒత్తిడి వల్ల నిద్రలేమి, ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు మరియు ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.