
జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల కోసం నిర్వాహకులు 15,000 మంది క్రీడాకారుల పరిమితిని విధించడంతో, కొత్తగా అదనపు సభ్యులను చేర్చుకునే అభ్యర్థనలను ఓసీఏ తిరస్కరించింది.
భారత్ తరఫున 35 క్రీడాంశాల్లో 492 మంది అథ్లెట్లు పాల్గొననుండగా, అత్యధికంగా అథ్లెటిక్స్ విభాగం నుంచి 73 మంది బరిలోకి దిగనున్నారు.
ఇకపై కొత్త పేర్లను చేర్చడానికి అవకాశం లేదని, అత్యవసరమైతే ఇప్పటికే ఎంపికైన వారి స్థానంలో రీప్లేస్మెంట్ మాత్రమే చేసుకోవచ్చని ఓసీఏ స్పష్టం చేసింది.