
గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదలైన అజయ్ దేవగన్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3' ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 95.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
భారతీయ మార్కెట్లో 'దృశ్యం 3' ఏకంగా రూ. 66.75 కోట్ల నికర వసూళ్లను సాధించి అజయ్ దేవగన్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
మరోవైపు దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సిగ్మా' చిత్రం తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 2.70 కోట్ల గ్రాస్ రాబట్టింది.