
2027 అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో తాను ఆడతానా లేదా అనే విషయంపై రోహిత్ శర్మ స్పష్టత ఇవ్వలేదు.
ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న రోహిత్, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు.
ఇప్పటికే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.