
వచ్చే 25 ఏళ్లపాటు లోక్సభ సీట్లను 543కే స్తంభింపజేయాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కులగణనను కచ్చితంగా చేపట్టాలని, అయోధ్య రామాలయ విరాళాల చోరీపై దేశవ్యాప్త ఉద్యమం చేయాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించారు.
విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సభలు నిర్వహించనున్నట్లు, రాహుల్ గాంధీ ఈ నెల 22న పుణేలో జరిగే సభలో పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు.