
సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసులో, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం అతడిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
ఈ కేసు దర్యాప్తును నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయగా, నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అవాస్తవమని కొట్టిపారేశారు.