
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్‌లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 ప్రిలిమ్స్ కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
'శ్రీరామ్స్ ఐఏఎస్' సంస్థ భాగస్వామ్యంతో అందించే ఈ శిక్షణకు ఎంపిక కోసం ఆబ్జెక్టివ్, ఆప్టిట్యూడ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదని, సెప్టెంబర్ 23 సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.