
2004లో నమోదైన క్రిమినల్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఫోర్జరీ మరియు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఈ కేసు కారణంగా తన రైల్వే ఉద్యోగాన్ని కోల్పోయానని, 22 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తనకు న్యాయం జరిగిందని జాకబ్ మార్టిన్ పేర్కొన్నారు.