
ఇస్రో శుక్రవారం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 వాహకనౌక ద్వారా ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
2,367 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని 171 కి.మీ x 31,026 కి.మీ కక్ష్యలో చేర్చామని, దీని జీవితకాలం సుమారు 7 ఏళ్లు ఉంటుందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదేనని, గగన్‌యాన్ ప్రాజెక్టుతో కలిపి మొత్తం ఆరు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వెల్లడించారు.