
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించింది.
శివాని మృతి పట్ల సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదకర ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.